Toer agriculture introduction activity1
From Karnataka Open Educational Resources
Activity 1 - భారతదేశ పట పరిశీలన- పంటల గుర్తింపు
లక్ష్యములు
- మన దేశంలో ఏ ఏ పంటలు ఎక్కడ పండుతాయో గుర్తిస్తారు.
- ఏ ఏ పంటలు ఎక్కువ ప్రాంతాలలో పండిస్తారో తెలుసుకుంటారు.
- మన రాష్ట్రం లో పండే పంటలను గుర్తిస్తారు.
- దేశంలో పండు పంటలను రాష్ట్రంలో పండు పంటలను వర్గీకరిస్తారు.
పద్దతి:
పటాన్ని పరిశీలింప జేయడం, (అవసరమయితే అట్లాసు ను కూడా ఉపయేగించుకోండి) మన దేశంలో ఏ ఏ పంటలు ఎక్కడెక్కడ పండిస్తున్నారో పరిశీలించి రాసేలా చూడాలి.
సమయము:
25 నిమిషాలు.
టి.ఎల్.ఎం.:
భారతదేశ పటం.
సోపానాలు:=
- చిత్రాన్ని పరిశీలింప చేయాలి.
- గుర్తుల ఆధారంగా పంటలపండే ప్రదేశాలను గుర్తింపజేసి పట్టికలో రాయించాలి.
సాంఘీక శాస్త్ర పాఠ్యపుస్తకాన్ని గాని, గ్రంధాలయం లోని పుస్తకాలను గాని చూసి వివిధ ప్రదేశాలలో ప్రధానంగా పండే పంటల జాబితా తయారు చేయించాలి.
దేశం | రాష్ట్రం | దేశం/రాష్ట్రం | |
పంటల పేర్లు | |||
పంటల పేర్లు | |||
పంటల పేర్లు |
చర్చింపదగు ప్రశ్నలు :
- ఏ ఏ పంటలను ఎక్కువ ప్రాంతాలలో పండిస్తారు? ఎందుకు?
- ఏ పంట తక్కువ ప్రాంతాలలో పండిస్తున్నారు ? ఎందుకు?
అంశాలు :
- ప్రాంతాన్ని బట్టి , అక్కడి వాతావరణం మరియు నీటి వనరులను బట్టి పంటలు పండించ బడుతాయి.
సాధించబడిన విద్యాప్రమాణాలు :
- విషయావగాహన
- పటనైపుణ్యాలు.