Toer agriculture introduction activity1

From Karnataka Open Educational Resources

Activity 1 - భారతదేశ పట పరిశీలన- పంటల గుర్తింపు

లక్ష్యములు

  1. మన దేశంలో ఏ ఏ పంటలు ఎక్కడ పండుతాయో గుర్తిస్తారు.
  2. ఏ ఏ పంటలు ఎక్కువ ప్రాంతాలలో పండిస్తారో తెలుసుకుంటారు.
  3. మన రాష్ట్రం లో పండే పంటలను గుర్తిస్తారు.
  4. దేశంలో పండు పంటలను రాష్ట్రంలో పండు పంటలను వర్గీకరిస్తారు.

పద్దతి:

పటాన్ని పరిశీలింప జేయడం, (అవసరమయితే అట్లాసు ను కూడా ఉపయేగించుకోండి) మన దేశంలో ఏ ఏ పంటలు ఎక్కడెక్కడ పండిస్తున్నారో పరిశీలించి రాసేలా చూడాలి.

సమయము:

25 నిమిషాలు.

టి.ఎల్.ఎం.:

భారతదేశ పటం.

సోపానాలు:=

  1. చిత్రాన్ని పరిశీలింప చేయాలి.
  2. గుర్తుల ఆధారంగా పంటలపండే ప్రదేశాలను గుర్తింపజేసి పట్టికలో రాయించాలి.

సాంఘీక శాస్త్ర పాఠ్యపుస్తకాన్ని గాని, గ్రంధాలయం లోని పుస్తకాలను గాని చూసి వివిధ ప్రదేశాలలో ప్రధానంగా పండే పంటల జాబితా తయారు చేయించాలి.

 

దేశం రాష్ట్రం దేశం/రాష్ట్రం
పంటల పేర్లు
పంటల పేర్లు
పంటల పేర్లు

చర్చింపదగు ప్రశ్నలు :

  1. ఏ ఏ పంటలను ఎక్కువ ప్రాంతాలలో పండిస్తారు? ఎందుకు?
  2. ఏ పంట తక్కువ ప్రాంతాలలో పండిస్తున్నారు ? ఎందుకు?

అంశాలు :

  1. ప్రాంతాన్ని బట్టి , అక్కడి వాతావరణం మరియు నీటి వనరులను బట్టి పంటలు పండించ బడుతాయి.

సాధించబడిన విద్యాప్రమాణాలు :

  1. విషయావగాహన
  2. పటనైపుణ్యాలు.